-
ఇక్కడ చిత్రంలో ఉన్న ప్రముఖ వ్యక్తిని గుర్తు పట్టగలరా? మన రాష్ట్రానికి ముఖ్య మంత్రిగా చేసారు. మరి మన ఆంద్ర ప్రదేశ్ ను ఇప్పటి వరకు పరిపాలించిన ముఖ్య మంత్రులు ఎందరు? ఇదుగో ఇక్కడ వివరాలు ఉన్నాయి మీ కోసం.
వీరందరి చిత్రాలను సేకరించండి. వారి కాలంలో జరిగిన ప్రధానమైన ఘట్టాలను ఆ చిత్రాల కింద రాయండి.
సంఖ్య పేరు ఆరంభము అంతము రాజకీయ పార్టీ 1 నీలం సంజీవరెడ్డి 1956 నవంబర్ 1 1960 జనవరి 11 కాంగ్రెసు 2 దామోదరం సంజీవయ్య 1960 జనవరి 11 1962 మార్చి 29 కాంగ్రెసు 3 నీలం సంజీవరెడ్డి 1962 మార్చి 29 1964 ఫిబ్రవరి 29 కాంగ్రెసు 4 కాసు బ్రహ్మానంద రెడ్డి 1964 ఫిబ్రవరి 29 1971 సెప్టెంబర్ 30 కాంగ్రెసు 5 పి.వి.నరసింహారావు 1971 సెప్టెంబర్ 30 1973 జనవరి 10 కాంగ్రెసు 6 రాష్ట్రపతి పాలన 1973 జనవరి 10 1973 డిసెంబర్ 10
7 జలగం వెంగళరావు 1973 డిసెంబర్ 10 1978 మార్చి 6 కాంగ్రెసు 8 డా.మర్రి చెన్నారెడ్డి 1978 మార్చి 6 1980 అక్టోబర్ 11 కాంగ్రెసు-ఐ 9 టంగుటూరి అంజయ్య 1980 అక్టోబర్ 11 1982 ఫిబ్రవరి 24 కాంగ్రెసు-ఐ 10 భవనం వెంకట్రామ్ 1982 ఫిబ్రవరి 24 1982 సెప్టెంబర్ 20 కాంగ్రెసు-ఐ 11 కోట్ల విజయభాస్కరరెడ్డి 1982 సెప్టెంబరు 20 1983 జనవరి 9 కాంగ్రెసు-ఐ 12 నందమూరి తారక రామారావు 1983 జనవరి 9 1984 ఆగష్టు 16 తెలుగుదేశం 13 నాదెండ్ల భాస్కరరావు 1984 ఆగష్టు 16 1984 సెప్టెంబర్ 16 కాంగ్రేసు 14 నందమూరి తారక రామారావు 1984 సెప్టెంబర్ 16 1985 మార్చి 9 తెలుగుదేశం 15 నందమూరి తారక రామారావు 1985 మార్చి 9 1989 డిసెంబర్ 3 తెలుగుదేశం 16 డా.మర్రి చెన్నారెడ్డి 1989 డిసెంబర్ 3 1990 డిసెంబర్ 17 కాంగ్రేసు 17 నేదురుమిల్లి జనార్ధనరెడ్డి 1990 డిసెంబర్ 17 1992 అక్టోబర్ 9 కాంగ్రేసు 18 కోట్ల విజయభాస్కరరెడ్డి 1992 అక్టోబర్ 9 1994 డిసెంబర్ 12 కాంగ్రేసు 19 నందమూరి తారక రామారావు 1994 డిసెంబర్ 12 1995 సెప్టెంబర్ 1 తెలుగుదేశం 20 నారా చంద్రబాబునాయుడు 1995 సెప్టెంబర్ 1 2004 మే 14 తెలుగుదేశం 21 వై.యస్.రాజశేఖరరెడ్డి 2004 మే 14 2009 సెప్టెంబర్ 2 కాంగ్రేసు 22 కొణిజేటి రోశయ్య 2009 సెప్టెంబర్ 3 కాంగ్రేసు -
మీకు తెలుగు సంవత్సరాల పేర్లు తెలుసా? ఇపుడు నడుస్తున్న సంవత్సరం పేరు ఏమిటో మీరు చెప్పగలరా? తెలియకపోతే ఒకసారి మీ ఇంటిలో అమ్మానాన్న వాళ్ళను అడిగి చూడండి.
తెలుగు సంవత్సరాల పేర్లు మొత్తం అరవై ఉన్నాయి.
1. ప్రభవ
2. విభవ
3. శుక్ల
4. ప్రమోదూత
5. ప్రజోత్పత్తి
6.అంగీరస
7. శ్రీముఖ
8. భావ
9. యువ
10. ధాత
11. ఈశ్వర
12. బహుధాన్య
13. ప్రమాది
14. విక్రమ
15. వృష
16. చిత్రభాను
17. స్వభాను
18. తారణ
19. పార్ధివ
20. వ్యయ21.సర్వజిత్తు
22. సర్వధారి
23. విరోధి
24. వికృతి
25. ఖర
26. నందన
27. విజయ
28. జయ
29. మన్మథ
30. దుర్ముఖి
31. హేవిళంబి
32. విళంబి
33. వికారి
34. శార్వరి
35. ప్లవ
36. శుభకృతు
37. శోభకృతు
38. క్రోధి
39. విశ్వావసు
40. పరాభవ41.ప్లవంగ
42. కీలక
43. సౌమ్య
44. సాధారణ
45. విరోధికృతు
46. పరీధావి
47. ప్రమాదీచ
48. ఆనంద
49. రాక్షస
50. నల
51. పింగళ
52. కాలయుక్త
53. సిద్ధార్ధి
54. రౌద్రి
55. దుర్మతి
56. దుందుభి
57. రుధిరోద్గారి
58. రక్తాక్షి
59. క్రోధన
60. అక్షయ -
కోపం, అసహనం ఎక్కువగా ఉండే వ్యక్తులకు గుండె ఆగిపోవడం, గుండె పోటు వచ్చే ప్రమాదాలు ఎక్కువని హెచ్చరిస్తున్నారు అమెరికా పరిశోధకులు. ''తన కోపమే తన శత్రువు'' అని మన వాళ్ళు కూడా ఏనాడో చెప్పారు. తాజాగా అమెరికా పరిశోధకులు కూడా ఇదే విషయాన్ని ధ్రువీకరిస్తున్నారు. ఇటలీలోని నాలుగు గ్రామాల్లో 5,614 మందిపై అమెరికా పరిశోధకులు నిర్వహించిన తాజా అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. అతి కోపం, అసహనం ఎక్కువగా ఉండేవారిలో కెరోటిడ్ రక్తనాళాలు మందంగా మారిపోవడంతో గుండె పోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు తేలిందని పరిశోధనకు నేతృత్వం వహించిన ఏంజెలీనా సుటిన్ తెలిపారు. ఇతరులతో ఎక్కువగా పోటీపడటంతో పాటు స్వప్రయోజనాల కోసం ఘర్షణపడే వ్యక్తుల్లో ధమనులు మందంగా మారతాయని, వారికి హృదయ సంబంధ వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువని ఆమె వెల్లడించారు.
మరి దీని నుంచి మనం ఏం నేర్చుకొందాం? కాస్త ప్రశాంతంగా ఉండటం నేర్చుకొందాం. ఆనందంగా ఉండటం నేర్చుకొందాం. -
వివిధ రకాల పండ్లను కాల్షియం కార్బైడ్‌తో మగ్గబెట్టడం వల్ల కలిగే ఆరోగ్య అనర్థాలను కేంద్రం తీవ్రంగా పరిగణిస్తోంది. ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాలని భావిస్తోంది. ప్రస్తుతం వినియోగిస్తున్న కాల్షియం కార్బైడ్ స్థానే ఇథలీన్‌ను ఉపయోగించడం సురక్షితమని భావిస్తున్నారు. ప్రమాణాల రూప కల్పనకు జాతీయ ఉద్యాన బోర్డు ఆధ్వర్యంలో ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసినట్లు భారత వ్యవసాయ పరిశోధన మండలి తెలిపింది. వివిధ రకాల పండ్లను ఏయే ఉష్ణోగ్రతల్లో ఎంత మేర ఇథలీన్ ఉపయోగించి మగ్గబెట్టాలనేదానిపై కమిటీ కసరత్తు చేస్తోండిపుడు. -
'చెలిమి' అనే మాటకు అర్థం మీకు తెలుసునుగా! స్నేహం, దోస్తి, మైత్రి అనే మాటలు కూడా అదే అర్థమిస్తాయి. స్నేహం అంటే ఒకరిపైన ఒకరికి ప్రేమ ఉండడం. ఎప్పుడూ కలిసి మెలసి ఆడుకోవాలనీ, ఒకరికి కష్టం వస్తే మరొకరు సాయం చేయాలనీ అనుకోవడం - అది స్నేహం యొక్క అంతరార్థం.
అలాంటి గాఢ స్నేహితులను గురించి చిన్న కథ చెబుతాను. రమణ, రవి ఎంతో మంచి స్నేహితులు, ఇద్దరూ ఇరుగుపొరుగు ఇళ్ళల్లో ఉంటున్నారు. చిన్నప్పటినుంచి ఒకే బడిలో చడువుకుంటున్నారు. కలిసి బడికి వెళ్ళి పక్కపక్కనే కూర్చునేవారు. ఇద్దరికి మంచి మార్కులే వచ్చేవి.
ఒకరోజు బడి దగ్గర ఉన్న చెరువు గట్టున కొందరు పిల్లలు ఆడుకుంటున్నారు. రమణా, రవీ బడికి వెళుతూ వాళ్ళని చూశారు.
'ఒరేయ్! చిన్న పిల్లలు నీళ్ళ దగ్గరికి వెడితే ప్రమాదం. వెళ్ళి పొమ్మని చెపుదాం.'' అని అన్నాడు రమణ రవితో.
''పోరా! మనకెందుకు మనం చెపితే వాళ్ళు వింటారా? పద పద, బడికి వేళయిపోతూంది.'' అన్నాడు రవి.
సరే, వీళ్ళు నాలుగడుగులు వేశారో లేదో పిల్లలు గొల్లున గోల చేయడం వినిపించింది. ఎవరో చిన్న పిల్ల నీళ్ళలో కాలు జారి పడనే పడింది. రవి, రమణ వెనక్కి పరిగెత్తుకొచ్చారు. రవి చప్పున చొక్కా విప్పి నీళ్ళలో దూకాడు. నీళ్ళల్లో పడిన పిల్ల కాళ్ళు తేలిపోతుండగా చెరువులోకి జారిపోతూంది. రవి ఆ పిల్ల గౌెను పట్టుకుని ఒడ్డుకు లాక్కుని వచ్చాడు.
ఆ పాప భయంతో వణికిపోతూంది. పెద్దవాళ్ళు కొందరు ఈ గొడవ విని గబగబా వచ్చారు. పిల్లని ఎత్తుకుని గట్టు మీద కూర్చో బెట్టారు. కళ్ళు తెరిచి దిక్కులు చూస్తున్నది. పాప తండ్రికి ఈ విషయం తెలిసింది. ఆయన అక్కడికి వచ్చాడు. తన బిడ్డను రక్షించినందుకు రవిని మెచ్చుకున్నాడు. రవి అమ్మానాన్న కూడా జరిగింది విని పాపకు, రవికి కూడా ప్రమాదం తప్పినందుకు సంతోషించారు.
ఇదంతా పూర్తయి బడికి కొంచెం ఆలస్యంగా చేరారు మిత్రులిద్దరూ. అప్పటికే రవి చేసిన సాహసకార్యం అందరికీ తెలిసిపోయింది. ఆ సాయంత్రం ప్రత్యేకంగా ఒక మీటింగ్ పెట్టారు. పాప తల్లిదండ్రులు రవికి బహుమతిగా నూరు రూపాయలు ఇచ్చారు. హెడ్మాస్టరు ప్రశంసాపత్రం బహుకరించారు. సభ పూర్తి అయ్యే సమయానికి రమణ తను కూడా ఒక్క నిమిషం మాట్లాడతానని అనుమతి కోరాడు.
''పెద్దలందరికీ వందనాలు. రవి సాహసవంతుడు. మంచివాడు. కానీ అవసరం అయినపుడు మాట్లాడడు. ముందు చూపులేదు. అది ఒక్కటే లోపం.'' అనేసి వెళ్ళి కూర్చున్నాడు. ఈ మాటలకు పిల్లలు పెద్దలు కూడా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. రవికి అంత గౌరవం జరిగినందుకు ఈర్షతో ఇలా మాట్టాడాడు అనుకున్నారు.హెడ్మాస్టరు రమణని వేదిక మీదికి పిలిచి-
''అందరు రవిని మెచ్చుకుంటూ ఉంటే నువ్వు అలా అనడం ఏమీ బాగుండలేదు రమణా! ఇందుకు ఏదో కారణం ఉండాలి. ఏమిటిది?'' అన్నారు. రమణ ఉదయం తామిద్దరు చెరువు దగ్గర నడుస్తున్నప్పుడు జరిగిని సంభాషణ చెప్పాడు.
''ముందుగానే ఆ పిల్లల్ని దూరంగా పంపి ఉంటే ఆ ప్రమాదం జరిగేది కాదు'' అన్నాడు రమణ. సభలో ఉన్న వారందరు నిజమే అని అంగీకరించారు. పాప తండ్రి మాట్లాడటానికి లేచి నిలబడటంతో అందరూ నిశ్శబ్బమై పోయారు.
''రమణ, రవికి నిజమైన స్నేహితుడు. ఎందుకంటే అందరూ రవిని మెచ్చుకున్నాగానీ, మిత్రునిలోని లోపాన్ని చెప్పి సరిదిద్దుకోమని హెచ్చరించిన రమణ, రవి మేలుకోరినవాడు. రవి ఇంకా పైకి రావాలన్న అభిమానంతో ఆ చిన్నలోపం కూడా లేకుండా ఉండాలని కోరుకుంటున్నాడు. మిత్రుడంటే ఎప్పుడూ ప్రేమగా ఉండేవాడు మాత్రమే కాదు. లోపాలను కూడా ఎత్తిచూపి మంచి మార్గం చూపేవాడు కూడా. అయితే రమణ తానైనా కనీసం ఆ పిల్లలను నీటి వద్దకు పోవద్దని చెప్పవలసింది. ఏది ఏమైనా పాపకి తప్పిన ప్రమాదానికి నాకు సంతోషంగా ఉంది. రవి, రమణల చెలిమి మరింత పెరగాలని ఆశీర్వదిస్తున్నాను అన్నారు. అందరూ చప్పట్లు కొట్టారు.
-- తురగా జానకీరాణి. -
అధిక రక్తపోటును నియంత్రించడంలో వెల్లుల్లి మిశ్రమం దివ్యౌషధమని తేలింది. డాక్టర్ కారిన్ రీడ్ నేతృత్వంలో అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం చేసిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. అయితే ముడి లేదా ఉడికించిన వెల్లుల్లి, వెల్లుల్లి పొడి మాత్రం అంత ప్రభావం చూపదని పరిశోధకులు అంటు న్నారు. నిల్వ ఉంచిన వెల్లుల్లి ప్రభావవంతంగా పనిచేస్తుందన్నారు. వెల్లుల్లి నైట్రిక్ ఆక్సైడ్(ఎన్వో), హైడ్రోజన్ సల్ఫేడ్ లాంటి రసాయనాల విడుదలకు దోహదపడుతుంది. దీనిద్వారా రక్తనాళాలు ఉపశమనం పొందుతాయి. తద్వారా అధిక రక్తపోటు నియంత్రణలోకి వస్తుంది.