-
'అనగనగా' అంటూ ఆసక్తి రేకెత్తిస్తూ చెప్పే కథల్లో అందమైన పలుకుబడి ఉంటది. బడిలో చెప్పే పాఠం కన్నా బామ్మ చెప్పిన కథే బాగా గుర్తుంటది. ఎందుకంటే కథ ఊహల్లోకి నడిపిస్తది.
పిల్లల్ని కూర్చున్న చోటు నుంచి ఊహల ప్రపంచంలోకి నడిపించే శక్తి కథనానికి ఉంది. ఇష్టమైన పరిసరాల్ని, జంతువుల్ని కళ్లకు కట్టే కథలంటే పిల్లలు చెవి కోసుకుంటరు. నిద్రపుచ్చేందుకు కథ చెప్పినా మెలకువ రాగానే మరపు లేకుండా కథ మొత్తం
చెప్తరు పిల్లలు. కానీ, పాఠం? చెప్పడం కష్టమే. కథ ఆకట్టుకున్నట్టు పాఠం ఆకట్టుకోదు మరి.
పిల్లలకు చదువు అబ్బాలని పాఠాలను కథలుగా మలచి చెప్పే పంతుళ్లెందరో ఉన్నరు. వాళ్ల ప్రయోగాలతో పసి ఊహల్లో క్రియేటివిటీ మొగ్గతొడుగుతున్నది. అక్కడక్కడా వెల్లివిరిసిన కథా చైతన్యం "పిల్ల'వాగుల్లా ప్రవహిస్తుంది. ఆ వాగులన్నీ కలిసి జిల్లాకో ఏరులా మారినయ్. ఆ ఏరులన్నీ వంకలు తిరుగుతూ ఓ నదిగా మారినయ్. ఆ నది పేరే 'తెలంగాణ బడి పిల్లల కథలు',
బాల చెలిమి'లోని ఊట నీళ్లతో ఆ కథల రుచి చూద్దాం !
Download
-
-
-
-
-
-
-
-