ఈ బెరళ్లు లేత రంగులో లేదా ముదురు రంగులో ఉండవచ్చు. అలాగే ఆకులు కూడా రకరకాల పరిమాణాల్లో,రూపాల్లో ఉంటాయి. వీటి గురించి తెలుసుకొనేందుకు, చెట్లతో స్నేహం చేసేందుకు ఒక పద్ధతి ఉంది. అదేమంటే చెట్ల ఆటోగ్రాఫ్ తీసుకోవడమే!
బెరడు ముద్రలు
చెట్టు ఆటోగ్రాఫ్ తీసుకొనేందుకు తెల్లని కాగితాన్ని బెరడుకు దగ్గరగా ఆనించి ఉంచండి. ఒక క్రేయాన్‌ను తీసుకొని కాగితం మీద రుద్దండి. బెరడులో ఉబ్బెత్తుగా ఉన్న ప్రాంతంలో కాగితం మీద రంగులు పడతాయి. బెరడులో పగుళ్లు ఉన్న ప్రాంతంలో కాగితం మీద తెల్లగానే ఉండిపోతుంది. సాధ్యమైనంత వరకు బెరడు ఏ రంగులో ఉందో అదే రంగు క్రేయాన్‌ను ఉపయోగించండి. అలా సాధ్యం కానపుడు ముద్ర పక్కనే బెరడు రంగును సూచించండి. ఇలా రకరకాల చెట్ల సంతకాలను సేకరించండి. బెరడుల మధ్య వ్యత్యాసాన్ని పోల్చి చూడండి.
ఆకుల ముద్రలు
ఆకుల ఈనెలు పైకి ఉండేలా ఆకును ఏదైనా నున్నని ఉపరితలంపైన ఉంచండి. ఆకుపైన తెల్లని కాగితాన్ని ఉంచండి. క్రేయాన్‌తో కాగితంపైన రుద్దండి. ఆకు రూపం కాగితం మీద ఏర్పడుతుంది. ఇలా సేకరించిన ఆటోగ్రాఫ్‌తో పాటు ఆ చెట్టు పేరును రాయడం మరచిపోకండి. ఇలా ఒక చెట్టు ఆల్బమ్‌ను తయారు చేయవచ్చు? ఇలా చేస్తే చెట్ల గురించి ఎక్కువగా తెలుసుకొనే అవకాశం అభిస్తుంది. తెలుగులో ఆ చెట్టును ఏమని పిలుస్తారు? అది ఎటువంటి పూలనూ, పళ్లను ఇస్తుంది? దీనిలో ఏ భాగమైనా ఔషధ లక్షణాలను కలిగివుంది? ఈ చెట్టుకు సంబంధించి ఏమైనా పురాణ కథలు కానీ, ప్రత్యేక మైన కథలు కానీ ప్రచారంలో ఉన్నాయా? ఈ సమాచారాన్నంతా సేకరిస్తే చెట్ల సమాచార నిధి మీ సొంతమైనట్లే!