మంచి పుస్తకం, మంచి మిత్రునితో సమానం.
సంతోషాన్నీ, తెలివినీ ఇచ్చే మంచి మిత్రుడు పుస్తకం. ప్రపంచంలో ఏ మూలనైనా వికసించే విజ్ఞాన వీచికల్ని మన మధ్య నిలిపే ఈ అక్షరాలు ఎంతో గొప్పవి. పుస్తకాలు మిగతా ప్రపంచానికీ, మనకీ మధ్య రాయబారులు. పుస్తకాలు చదవడం చిన్నపిల్లవాని నుండి పెద్దవారి వరకు అందరికీ అవసరమే. దీనివల్ల తెలివితేటలతో పాటు, మానసికారోగ్యం కూడా పెరుగుతుంది. వివిధ దేశాల లోని భిన్న సంస్కృతులు, అక్కడి ప్రజల అలవాట్లు మొదలైన ఎన్నో విషయాలు పుస్తకాలు చదవటం వల్ల తెలుస్తాయి. మనం చదవడానికి ఎంచుకొనే ఒక్కొక్క మంచి పుస్తకం ద్వారా మన మంచితనం, బుద్ధి ఒక్కో మిల్లీమీటరు పెరుగుతుందంటారు. చదవడాన్ని ప్రేమించేవారు సంఘంలో గౌరవం పొందుతారు. సమాజానికి ఉపయోగపడతారు.
బాల చెలిమి నవంబర్ 1990 సంచికను ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు.