-
కాలం ప్రపంచంలో ప్రతి మనిషికీ రోజుకు 24 గంటలే ఇచ్చింది. గంటకు అరవై నిమిషాలే ఇచ్చింది. ఎక్కడా తేడా లేదు. వివక్ష లేదు. కొందరు మాత్రమే ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. చాలామంది ఎలా వాడుకోవాలో తెలియక వృథా చేసుకుంటున్నారు. విజేతకూ పరాజితుడికీ తేడా...సమయపాలన! కాలం కథ ఏమిటో, కాలం మనకు నేర్పించే పాఠాలేమిటో, కాలాన్ని కబళించే సర్పాలేవో ఈ పుస్తకంలో మాచర్ల రాధాకృష్ణమూర్తి చక్కగా విశ్లేషించారు.
- 'అత్యంత విజ్ఞుడైన సలహాదారు కాలం'
- 'రీసైకిల్ చేయలేని ఏకైక వస్తువు దుబారా చేసిన కాలం'
- 'మనం రోజును ఎలా ఖర్చుచేస్తావో, జీవితాన్ని కూడా అలానే ఖర్చుచేస్తాం'...
ఇటు వంటి ఎన్నో సూక్తులు ఆలోచింపజేస్తాయి. శైలి ఆహ్లాదకరంగా ఉంది. కాలాన్ని సద్వినియోగం చేసుకోడానికి రచయిత ఇచ్చిన చిట్కాలు ఆచరణసాధ్యంగానే ఉన్నాయి.
సమయపాలన
రచన: మాచర్ల రాధాకృష్ణమూర్తి
పేజీలు: 189; వెల: రూ.100/-
ప్రతులకు: ఎం.ఆర్.కె.మూర్తి
హారిక పబ్లికేషన్స్, ప్రకాష్‌నగర్
నరసరావుపేట, గుంటూరు జిల్లా.