Flash News
Powered by Blogger.

Popular Posts

Blog Archive

Popular Posts

Bala Chelimi

Editor:
Manikonda Veda Kumar

Executive Editor:

Gali Udaya Kumar
---- ----
Bala Chelimi
Chandram, 490, Street No.11,
Himayat Nagar, Hyderabad 500 029
www.balachelimi.com

Mail Instagram Pinterest RSS

పురోభివృద్ధి దిశగా బాల సాహిత్యం


కాలానుగుణమైన మార్పులను సంతరించుకుంటూ ఇటీవలి కాలంలో బాలసాహిత్యం విరివిగా వస్తుండడం మంచి పరిణామమని ప్రముఖ బాలసాహితీవేత్త డా.వి.ఆర్‌.శర్మ అన్నారు. చిల్డ్రన్స్‌ ఎడ్యుకేషన్‌ అకాడమీ, బాలచెలిమి పిల్లల వికాస పత్రిక ఆధ్వర్యంలో 'బాలచెలిమి ముచ్చట్లు' శనివారం ఆక్స్‌ఫర్డ్‌ గ్రామర్‌ స్కూల్‌లో నిర్వహించిన 'బాలసాహిత్య రచన- సవాళ్ళు' అనే అంశంపై జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. తొలి రోజుల్లో వచ్చిన బాల సాహిత్యంలో బాల్యపు అనుభవాలు, మంచీచెడుల ప్రస్తావనలు ఉండేవని, వంద సంవత్సరాల తరువాత బాల్యం మారిందని అంటూ ఇప్పటి రచయితలు రాసే అంశాలు, ఎన్నుకునే వస్తువులలో కూడా విభిన్నత కనిపిస్తున్నదని చెప్పారు. పిల్లలకు సాహిత్యాన్ని సులభశైలిలో అందించేందుకు రచయితలు చేస్తున్న కృషి మరింత విస్తృతం కావాలని ఆయన అభిప్రాయపడ్డారు. బాలసాహితీవేత్త పుట్టగుంట సురేష్‌కుమార్‌ మాట్లాడుతూ బాలసాహిత్యం ఎంత ఎక్కువగా వస్తే అది మానవ కళ్యాణానికి దారినివేస్తుందని అన్నారు. బాలలకు సులభమైన శైలిలో విషయాలను కూర్చి అందించగలిగిన నేర్పును కలిగిన రచనలు ఎక్కువగా వస్తున్నాయని చెప్పారు. బాలసాహితీవేత్తలు దాసరి వెంకటరమణ, చొక్కాపు వెంకటరమణ మాట్లాడుతూ మంచి సూత్రీకరణతో బాలసాహిత్యంలో వివిధ అంశాలు వెలువడాలని తెలిపారు.

 
చిల్డ్రన్‌ ఎడ్యుకేషన్‌ అకాడమి చైర్మన్‌ యం. వేదకుమార్‌ మాట్లాడుతూ తమ వంతు ప్రయత్నంగా పిల్లల కోసం ప్రచురణలతో పాటు దృశ్య శ్రవణ పద్దతుల ద్వారా బాల సాహిత్యాన్ని అందించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా పలు పాఠశాలలకు వెళ్ళి బాలల సదస్సులను నిర్వహించి వారి వికాసానికి దోహదమయ్యే కార్యక్రమాలను చేపట్టనున్నామని తెలిపారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన బాల సాహితీవేత్త డా. పత్తిపాక మోహన్‌ మాట్లాడుతూ ప్రపంచ తెలుగు మహాసభల తరువాత బాల సాహిత్యానికి క్రమంగా రచయితలు, బాలల నుండి పెరుగుతున్న ఆదరణ, పత్రికలు, మాధ్యమాలు, సమాజం నుండి లభిస్తున్న ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని మరింత విస్తృత కృషి కోసం నిపుణులతో కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో సాహితీవేత్తలు డా. బెల్లంకొండ సంపత్‌కుమార్‌, డా. ఎస్‌.రఘు, గరిపల్లి అశోక్‌, రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి, జుగాష్‌విలీ, తిరునగరి శ్రీనివాస్‌, మంచి పుస్తకం సురేష్‌, సయ్యద్‌ షాబీర్‌, బాలరాజ్‌గౌడ్‌, మహమ్మద్‌బేగ్‌, కె. ప్రభాకర్‌, కో-ఆర్డినేటర్ తదితరులు పాల్గొన్నారు. పలువురు బాలసాహిత్యాభిమానులు హాజరయ్యారు.News clips Slideshow

0 comments:

Post a Comment