Flash News
Powered by Blogger.

Popular Posts

Blog Archive

Popular Posts

Bala Chelimi

Editor:
Manikonda Veda Kumar

Executive Editor:

Gali Udaya Kumar
---- ----
Bala Chelimi
Chandram, 490, Street No.11,
Himayat Nagar, Hyderabad 500 029
www.balachelimi.com

Mail Instagram Pinterest RSS

చెట్లే వారి ప్రాణం


ఈ భూమి మీది చెట్లుపోతే, వాతావరణం మారిపోతుంది. నీరు పూర్తిగా అదృశ్యమౌతుంది. నేల గట్టిపడిపోతుంది. ఎటుచూసినా ఎడారి వాతావరణం ప్రత్యక్షమౌతుంది. ఈ కథలో జరిగింది ఇదే! అయితే తగిన సమయంలో ఈ విషయాన్ని ప్రజలు గుర్తిస్తే ఏమౌతుంది? చెట్ల విలువను తెలుసుకొని, వాటిని సంరక్షిస్తే ఏం జరుగుతుంది? ఈ కథకు వాస్తవంగా జరిగిన సంఘటనలే ఆధారం. ఆ ప్రాంత ప్రజలు శతాబ్దాలుగా తమ సాంప్రదాయాన్ని విడిచిపెట్టకుండా ఇప్పటికి పాటిస్తూనే ఉన్నారు.
ఇది అయిదు వందల సంవత్సరాల క్రితం సంగతి. పశ్చిమ భారతదేశంలో భయంకరమైన కరువు వచ్చింది. వానలు పడలేదు. చెట్ల ఎండిపోయాయి. గడ్డి పూర్తిగా మాయమైపోయింది. ఆకలి దప్పులతో జంతువులు చనిపోయాయి. ఆహారాన్ని సంపాందించేందుకు ప్రజలు కెన్నో కష్టనష్టాలు పడవలసి వచ్చింది. మూడు సంవత్సరాల పాటు ఒక్క చుక్క నీరు కూడా నేలకు రాలలేదు. ఒక్క గడ్డి పరక కూడా మొలకెత్తలేదు. కరవు కొనసాగుతూనే ఉంది.
అలా కరవు కోరల్లో చిక్కుకున్న ఒకానొక గ్రామంలో జంబాజీ అనే యువకుడు నివసిస్తూ ఉండేవాడు. ఎండిపోయినా బావులను చూసి అతడి గుండె తరుక్కుపోయింది. తన కుటుంబ సభ్యులు పస్తులు ఉండటం చూసి అతడిలో ఆగ్రహం పెల్లుబిక్కింది. చుట్టూ చూస్తే ఎండి బీటలు వారిన పంట భూములు కనిపించాయి. తన రాత ఎప్పుడూ చెబుతూవుండే పాత కాలపు రోజుల గురించి జంబాజీ ఆలోచించ సాగాడు. అప్పట్లో ఊళ్లన్నీ చెట్లతో నిండి పచ్చగా కళకళలాడుతూ ఉండేవి. నేల సారవంతంగా ఉండి, పంటలు చక్కగా పండేవి. నీటి కొరత అంటే ఏమిటో ఆ కాలంలో ఎవరికీ తెలియదు.
జంబాజీ ఎంతగానో ఆలోచించాడు. ఈ భూమినీ,భూమి మీద జీవులనూ కాపాడుతున్నది చెట్టేనని అతడికి అవగతమైంది. చెట్లే భూమిని కాపాడి, నీళ్లని పరిరక్షించాయన్న వాస్తవం అతడికి బోధపడింది. వానలు పడకపోయినా,నీటి కొరత రాకుండా కాపాడింది చెట్లేనని అతడు తెలుసుకొన్నాడు. ప్రజలు కూడా ఈ వాస్తవాలను గ్రహించకపోతే ముప్పు తప్పదని తలిచాడు జంబాజీ. మనజీవనానికి, పర్యావరణానికి సంబంధం ఉంది. పర్యావరణం ఆరోగ్యంగా ఉండాలంటే చెట్లు ఉండి తీరాలి.
ఆ యువకుడు తనకు తెలసినా సత్యాన్ని ప్రజలకు తెలియజేయటమే తన జీవిత పరమార్థమని భావించాడు. పర్యావరణ పరిరక్షణ అవసరాన్ని గురించి తెలియజేయటం మొదలు పెట్టాడు.
ఆరోగ్యకరమైన పర్యావరణ కోసం ప్రజలు తమ జీవిన విధానంలో మార్పును తెచ్చుకోవాలని అతడు బోధించనారంభించాడు.
జంబాజీ ఒక ఊరి నుంచి ఒక ఊరికి పయనిస్తే తన సిద్ధాంతాలను వివరించేవాడు. పచ్చని చెట్టును నరకవద్దు. జంతువును కానీ పక్షినీ కానీ చంపవద్దు. మనిషిలానే ప్రతి ప్రాణికి జీవించే హక్కు ఉంది. కనుక ప్రతి ప్రాణినీ గౌరవించుదాం. ఇవీ ఆయన చెప్పే సూత్రాలు.
ఆ యువకుడు ఇలాంటి 29 సూత్రాలను రూపొందించి ప్రచారం చేయసాగాడు. అనతికాలంలోనే ఆయనకు అనుయాయులు కూడా తయారయ్యారు. వారంతా కలిసి తమను బిషనోయ్‌లు లేదా 29 సూత్రాల వారుగా ప్రకటించుకొన్నారు. కొంతకాలం గడిచే సరికి ఊళ్లోని ప్రవచించిన 29 సూత్రాల ప్రకారం నడుచుకోవటం ప్రారంభించారు. దాంతో ఆ గ్రామాల్లో జీవన విధానమే మారిపోయింది. గ్రామాలన్నీ పచ్చగా కళకళలాడ సాగాయి. వాతావరణంలోని మార్పుల వల్ల ప్రతికూల ప్రభావాలేవీ ఆ గ్రామాలను చేరకుండా చెట్లు కాపాడుతుండేవి. జంతువులు, పక్షులు, సమస్త ప్రాణుల హాయిగా, సుఖంగా జీవించే సాగాయి.ఇలా దాదాపు మూడు వందల సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ ప్రాంతపు రాజు ఒక పెద్ద రాజసౌధాన్ని కట్టాలని సంకల్పించాడు. ఆ పరిసర ప్రాంతాల గ్రామాల్లో పచ్చని చెట్లు ఉంటాయన్నది అందరికీ తెలుసు. రాజమందిరాన్ని కట్టేందుకు రాజు తన భటులను ఆదేశించాడు. రాజ భటులు గొడ్డళ్లు భుజాన వేసుకొని గ్రామాలకు వచ్చారు. కానీ అవి బిషనోయ్‌ల గ్రామాలు. తరతరాలుగా ఈ గ్రామాల ప్రజలు పచ్చదనాన్నీ, వన్య ప్రాణులనూ, ఆ నేలనూ కాపాడుకొంటూ వస్తున్నారు. జంబాజీ ప్రవచించిన 29 సూత్రాలను తూచా తప్పకుండా పాటిస్తున్నారు వాళ్లు. ఎంత గొప్ప రాజైనా సరే వాళ్ల నమ్మకాలలో మార్పు తీసుకు రాలేడు.
రాజభటులు గొడ్డళ్లతో పచ్చారన్న వార్త తెలిసి గ్రామంలో అలజడి చెటరేగింది. ఆ సమయానికి అమృతాదేవి అనే ఆమె చల్ల చిలుకుతోంది. గొడ్డళ్లకు పదును పెట్టుకుంటున్న రాజ భటులను ఆమె చూసింది. వెంటనే ఆమెకు తన చిన్నతనంలో జరిగిన సంఘటన గుర్తుకు వచ్చింది.
జంబాజీ ప్రవచనాలను ఆమె తల్లి పాటిస్తుండేది. చెట్లను ఎలా ప్రేమించాలో అమృతకు నేర్పింది ఆమె తల్లే. ప్రతిరోజూ ఉదయాన్నే ఆమె అన్ని చెట్లకు నమస్కరించి, వాటిలో ఒక చెట్టును ఎంపిక చేసుకొనేది. ఆ చెట్టు చుట్టూ తన రెండు చేతులు వేసి కౌగింలిచుకొని ఆ చెట్టు బెరడుతో గుసగుసగా ఇలా చెప్పేది. '' ఓ చెట్టూ నువ్వు ఎంతో బలమైన దానవి. అంతకంటే ఎంతో అందమైన దానివి. నువ్వు మాకు ఆహారాన్ని అందిస్తావు. మా ప్రాణానికి ఊపిరి నీవు, నీకు మా కృతజ్ఞతలు. నిన్ను కాపాడేందుకు అవసరమైన బలాన్ని మాకు సమకూర్చు.'' అమృతకు తన తల్లి ప్రతి రోజూ ఉదయం చేసే ప్రార్థనలు గుర్తుకువచ్చాయి.
ఊరిలోని ఇతర పిల్లలంతా కూడా తమ తమ ప్రత్యేక చెట్లని ఎంపిక చేసుకుని వాటితో సంభాషించేవారు. తమ సొంత తోబుట్టువులుగా భావించి చెట్లను పాటలుపాడి వినిపించేవారు. అన్ని జంతువులు, పక్షులు వారి కబుర్లు వినేవి. ముఖ్యంగా కృష్ణ జింక బాగా వినేది. ఆ ప్రాణులకు ఊరి వారంటే ఏ మాత్రం భయం వేసేది కాదు. ఎందుకంటే వాటికి ఏ హాని తలపెట్టేవాళ్లు కాదు. వేటాడే వాళ్లు కాదు.
ఇప్పుడు చెట్లు ఎంతో ఆపదలో ఉన్నాయి.
చెట్లు నరికేయబోతున్న వారి దగ్గరకు అమృత పరుగున వెళ్లింది. ''మా చెట్లు నరికేయవద్దు. దయచేసి వాటికి ఏ హాని తలపెట్టవద్దు'' అంటూ అమృత ప్రాధేయపడింది. ''చెట్లు మా తోబట్టువులు. మా ఊరిని రక్షిస్తున్న దేవతలు మా చెట్లు. తాగే నీటికి, ఆహారానికి, మా ప్రాణానికి ఈ చెట్లే ఊపిరి'' అని అమృత వారికి చెప్పింది. వారు ఏ మాత్రం ఆమె చెప్పింది వినకుండా, అక్కడ నుండి వెళ్లిపోమని కేకలు వేయసాగారు. ఓ వృక్షాన్ని కౌగిలించుకుంది అమృత. ''నన్ను నరికివేయండి ముందు. నన్ను చంపి, చెట్టును వదిలేయండి'' అంటూ అమృత రోదించసాగింది.
చెట్లు నరకడానికి వచ్చిన వాళ్లంతా ఆశ్చర్యంగా అమృతను చూడసాగారు. కేవలం తమ యజమాని ఆజ్ఞలను అమలు చేయడమే వారికి తెలుసు. అమృతను పక్కకు లాగి, కిందకి తోసివేసారు. అమృత అంతే వేగంగా లేచి నిలబడి, మళ్లీ చెట్టును కౌగలించుకుంది. గొడ్డళ్లతో అమృత కాలి మడమలపై కొట్టసాగారు. దెబ్బతగిలి,నేలపైన పడింది. గాయాలవుతున్నా లెక్క చేయకుండా చెట్టును అంటి పెట్టుకుని అలానే కూర్చుంది. అమృతని నరికివేస్తేనే చెట్టను నరకాలనే తమ కోరిక నెరవేరుతుందని వారు గ్రహించారు. అమృతను నరికివేశారు. అమృత నేలకొరిగిన కొద్ది క్షణాల్లోనే కొన్ని వందల మంది చిన్నా పెద్దా, ఆడమగా తేడా లేకుండా అడవిలోకి వచ్చి తలోచెట్టును కావలించుకుని నిలబడ్డారు.
రాజభటులు తమ ప్రయత్నాలకు అడ్డువచ్చిన ప్రతి ఒక్కరిని పొట్టన పెట్టుకో సాగారు. వాళ్లు చంపుతున్న కొద్ది వందలు, సంఖ్యలో ఆ ఊరి జనం, చుట్టుపక్కల ఊళ్ళ జనం వచ్చి చెట్లను కావలించుకొంటు, ఒక్క చెట్టు కూడా నేలకు ఒరగకుండా కాపాడారు. అలా చెట్లను కాపాడేందుకు ప్రవాహంలా వస్తున్న ప్రజల్ని చూసి రాజ భటులు ఏమీ చేయలేక వెనుతిరిగారు. కానీ అప్పటికే జరగరాని ఘోరం జరిగిపోయింది. 363 మంది ప్రాణాలు కోల్పోయారు. చెట్లను కాపాడుకోవడానికి తమ ప్రాణాలు పణంగా పెట్టారు. ఆ ప్రకృతి ప్రేమికులు.
రాజు ఈ వార్తను నమ్మలేకపోయాడు.ఎవరైనా చెట్ల కోసం ప్రాణ త్యాగం చేస్తారా? ఆ విషయం తెలుసుకుందామని స్వయంగా ఆ గ్రామానికి ప్రయాణమయ్యాడు. గ్రామస్థులు చెట్ల కోసం జీవితాలు అర్పించిన తమ సహచరుల కోసం ప్రార్థనలు చేయసాగారు. వారెంతో గర్వంగా ఉన్నా వారి ప్రవర్తన ఎంతో మర్యాదగా ఉంది. తమ జీవితాలు చెట్లపైనే ఆధారపడి ఉన్నాయని తెలుసుకున్నప్పటి నుండి వారికి చెట్లపై ఎంతో ప్రేమ, అవినాభావ సంబంధం ఏర్పడ్డాయని రాజుకు తెలిపారు. చెట్లు మనం లేకున్నా బతకకలవు. కానీ, మనం చెట్లు లేకపోతే ఒక క్షణం కూడా బతకలేము అని చెప్పారు.రాజు వారి మాటలకు ఎంతో కదలిపోయాడు. బిషనోయీలు నివసించే ప్రాంతాల్లో కలప నరకటం, జంతువులను వేటాడడం వంటి వినాశకరం పద్ధతులను నిషేధించి, బిషనోయీల నమ్మకాన్ని రాజ్యంలో అంతా గౌరవించాలని ఆజ్ఞాపించాడు. ఇది జరిగి మూడు వందల సంవత్సరాలైనా, ఇప్పటికి కూడా బిషనోయీలు చెట్లంటే అంతే ప్రేమ చూపుతారు. చుట్టూ ఎడారి ఉన్నా వారి గ్రామాలు ఒయాసిస్సులు. చెట్లకి కొదువలేదు. జంతువులకు ప్రాణభయం లేదు. స్వేచ్ఛగా తమ ఇష్టం వచ్చినట్టు విహరిస్తాయి. ముఖ్యంగా అందమైన కృష్ణజింకలు. బిషనోయీలు ఇప్పటికీ తమ సిద్ధాంతాలను పాటిస్తూ భూమికీ, తమ తోటివారికి జీవితాన్ని ప్రసాదిస్తున్నారు.
-మమతా పాండ్య