పిల్లల లోని సృజనాత్మకతను వెలికి తీయాలని, ఇందుకోసం తల్లిదండ్రులు వారికి స్వేచ్ఛ ఇవ్వాలని చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ చైర్మన్, బాల చెలిమి పిల్లల పత్రిక సంపాదకుడు వేదకుమార్ అన్నారు. సిరిసిల్లా మండలం లోని రంగినేని సుజాత మోహనరావు ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ లొ రెండు రోజుల పాటు పిల్లల పండుగ పేరిట జరిగిన సృజనాత్మక రచనా కార్యశాల ఆదివారం ముగిసింది. కాళోజీ జయంతి సందర్భంగా ముందుగా పుష్పాంజలి కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు ముఖ్య అతిథిగా వేదకుమార్ హాజరై మాట్లాడారు. పిల్లల పండుగ పేరిట జిల్లాలోని బడిపిల్లల కోసం రచన కార్యశాల ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు. పిల్లలకు తల్లిదండ్రులు స్వేచ్ఛ ఇస్తేనే వారిలోని సృజనాత్మకత వెలికి వస్తుందని అన్నారు. 

0 comments:
Post a Comment