డ్రైవర్ అక్కర్లేని కారు తయారీలో గూగుల్ నిమగ్నమైంది. అంతర్జాల దిగ్గజం గూగుల్ ఇంటర్ నెట్ ఉపయోగించే ప్రతి ఒక్కరికి తెలుసు. డ్రైవర్ అవసరం లేకుండా తనంతట తానే సొంతంగా నడిచే కారును రూపొందించే పనిలో గూగుల్ ఇపుడు నిమగ్నమైంది. గూగుల్ ప్రయోగాత్మకంగా రూపొందించిన 7 కార్లు మానవ ప్రమేయం లేకుండానే 1000 మైళ్లు ప్రయాణించినట్లు 'న్యూయార్క్ టైమ్స్' పత్రిక వెల్లడించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్‌వేర్ సాయంతో నడిచే ఈ కారు తనకి సమీపంలో ఏమున్నా గ్రహిస్తుంది. దానికి అనుగుణంగా స్వయంగా నిర్ణయం తీసుకొంటుంది.
0 comments:
Post a Comment