Flash News
Powered by Blogger.

Popular Posts

Blog Archive

Popular Posts

Bala Chelimi

Editor:
Manikonda Veda Kumar

Executive Editor:

Gali Udaya Kumar
---- ----
Bala Chelimi
Chandram, 490, Street No.11,
Himayat Nagar, Hyderabad 500 029
www.balachelimi.com

Mail Instagram Pinterest RSS

గంగిగోవు పాలు గరిటడైన చాలు

సామెతలు...
తెలుగు సాహిత్యంలో సామెతల కేమీ కొదవ లేదు. నగర జీవి మరిచిపోయినా ఈ సామెతలు పల్లె జనం నోళ్లలో నేటికీ నానుతూ ఉన్నాయి. జంతువులు, చెట్లు, వ్యవసాయం..... ఇలా ఎన్నో విషయాల గురించి విలువైన సమాచారాన్ని సామెతల్లో నిక్షిప్తం చేశారు మన పూర్వీకులు. అటువంటి సామెతల నుంచి కొన్నిటిని ఇక్కడ ఇస్తున్నాం.

  •     గంగిగోవు పాలు గరిటడైన చాలు
  •     గంజి తాగేవానికి మీసాలు ఎగబట్టేవాడొకడన్నట్టు
  •     గంతకు తగ్గ బొంత
  •     గతి లేనమ్మకు గంజే పానకము
  •     గాజుల బేరం భోజనానికి సరి
  •     గాడిద కేమి తెలుసు గంధం చెక్కల వాసన
  •     గాడిద సంగీతానికి ఒంటె ఆశ్చర్యపోతే, ఒంటె అందానికి గాడిద మూర్చపోయిందట
  •     గారాబం గజ్జెలకేడిస్తే, వీపు గుద్దులకేడ్చిందంట
  •     గాలిలో దీపం పెట్టి దేవుడా నీదే భారం అన్నాట్ట
  •     గుండ్లు తేలి... బెండ్లు మునిగాయంటున్నాడట
  •     గుంపులో గోవిందా
  •     గుడ్డి కన్నా మెల్ల నయము కదా
  •     గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించినట్టు
  •     గుడ్డోడికి కుంటోడి సాయం
  •     గుడ్డెద్దు చేలో పడినట్లు
  •     గుమ్మడి కాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు
  •     గురివింద గింజ తన నలుపెరగదంట
  •     గుర్రం కరుస్తుందని గాడిద వెనకాల దాక్కున్నాడట
  •      గుర్రం గుడ్డిదైనా దాణాకు తక్కువ లేదు
  •     గుర్రపు పిల్లకు గుగ్గిళ్ళు తినటం నేర్పాలా?
  •     గుర్రానికి మేతేస్తే ఆవు పాలిస్తుందా
  •     గూటిలో కప్ప పీకితే రాదు
  •     గొల్ల ముదిరి పిళ్ళ అయినట్లు
  •     గోటితో పోయేదానికి గొడ్డలెందుకు
  •     గోడకేసిన సున్నం
  •     గోతి కాడ నక్కలా
  •     గోరంత ఆలస్యం కొండొంత నష్టం
  •     గోరుచుట్టు మీద రోకటిపోటు
  •     గాడిదకు తెలియునా గంధం పొడి వాసన;పంది కేమి తెలియును పన్నిటి వాసన

0 comments:

Post a Comment