ఒక దొంగ అర్ధరాత్రి వేళ దొంగతనానికి బయలు దేరాడు. అతడు మెల్లిమెల్లిగా ఒక ఇంటి గోడదూకి ముందుకు అడుగు వేశాడు. దొంగ అడుగుల చప్పుడు ఆ ఇంటిని కాపలా కాస్తున్న కుక్క పసి గట్టింది. అంతే .... మొరగడం మొదలెట్టింది. గొలుసుతో కట్టేసి ఉండటం వల్ల కుక్క దొంగను కరవలేదు. 'హమ్మయ్య ఇంకా నయం. ఇది గొలుసుతో కట్టి ఉంది. ఇది ఇలాగే మొరిగితే నేను పట్టుపడటం ఖాయం. ముందు దీన్ని మొరగకుండా చెయ్యాలి.'' అనుకుని సంచీలో నుంచి ఒక రొట్టెముక్క తీసి కుక్క దగ్గర పెట్టాడు. కాని కుక్క దానిని ముట్టుకోలేదు. మళ్ళీ మొరగడం ప్రారంభించింది. దొంగ దానిని బుజ్జగించేందుకు దాని దగ్గరికి వచ్చాడు. అంతే కుక్క దొంగ కాలుని కరిచింది. దొంగకు విపరీతమైన కోపం వచ్చింది.
''నన్నెందుకు కరిచావ్ నీకు ఒక రొట్టె ముక్క కూడా ఇచ్చాను కదా?'' అన్నాడు.
వెంటనే కుక్క ''నేను నిన్ను ఎందుకు కరిచానంటే - నువ్వు నాకు రొట్టెముక్క ఇవ్వకముందు నువ్వు మంచి వాడివో, చెడ్డవాడివో నాకు తెలి యదు. కాని ఇప్పుడు తెలుసుకున్నాను. నువ్వు చెడ్డవాడివనీ, నాకు రొట్టెముక్క ఇచ్చి నన్ను ఏమార్చాలని చూస్తున్నావనీ, అందుకే నిన్ను కరిచాను'' అంది కుక్క.
(లియో టాల్ స్టాయ్ కథ ఆధారంగా)
0 comments:
Post a Comment