Flash News
Powered by Blogger.

Popular Posts

Blog Archive

Popular Posts

Bala Chelimi

Editor:
Manikonda Veda Kumar

Executive Editor:

Gali Udaya Kumar
---- ----
Bala Chelimi
Chandram, 490, Street No.11,
Himayat Nagar, Hyderabad 500 029
www.balachelimi.com

Mail Instagram Pinterest RSS

కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా?

సామెతలు...
తెలుగు సాహిత్యంలో సామెతల కేమీ కొదవ లేదు. నగర జీవి మరిచిపోయినా ఈ సామెతలు పల్లె జనం నోళ్లలో నేటికీ నానుతూ ఉన్నాయి. జంతువులు, చెట్లు, వ్యవసాయం..... ఇలా ఎన్నో విషయాల గురించి విలువైన సమాచారాన్ని సామెతల్లో నిక్షిప్తం చేశారు మన పూర్వీకులు. అటువంటి సామెతల నుంచి కొన్నిటిని ఇక్కడ ఇస్తున్నాం.
  •     కంచం, చెంబూ బయట పారేసి రాయి రప్ప లోపల వేసు కున్నట్లు
  •     కంచలమా కూడబెడితే మంచాలమ్మ మాయం చేసిందని
  •     కంచానికి ఒక్కడు - మంచానికి ఇద్దరు
  •     కంచి లో చేయబోయే దొంగతనానికి కాళహస్తి నుంచే వంగి నడిచినట్లు
  •     కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా?
  •     కంచె లేని చేను, తల్లి లేని బిడ్డ ఒక్కటే
  •     కంచేచేను మేసినట్లు
  •     కంటికి ఇంపైతే నోటికీ ఇంపే
  •     కంటికి రెప్ప కాలికి చెప్పు
  •     కంటికి రెప్ప దూరమా
  •     కండలేని వానికే గండం
  •     కందకి లేని దురద కత్తిపీటకెందుకు?
  •     కందకు లేదు చేమకు లేదు తోటకూరకెందుకు దురద
  •     కందెన వేయని బండికి కావలసినంత సంగీతం
  •     కంపలో పడ్డ గొడ్డు వలె
  •     కక్కిన కుక్క వద్దకూ కన్న కుక్క వద్దకూ కానివాణ్ణయినా పంపరాదు
  •     కక్కుర్తి మొగుడు పెళ్ళాం కడుపు నొప్పిబాధ ఎరుగడు
  •     కక్కొచ్చినా కళ్యాణ మొచ్చినా ఆగవు
  •     కట్టని నోరు కట్ట లేని నది ప్రమాద కరము
  •     కట్టుకున్నదానికి కట్టు బట్టల్లేవు కానీ, ఉంచుకున్నదానికి ఉన్ని బట్టలు కొంటానన్నాడట
  •     కట్టేవి కాషాయాలు - చేసేవి దొమ్మరి పనులు
  •     కడివెడు గుమ్మడికాయైనా కత్తిపీటకి లోకువే
  •     కడుపుతో ఉన్నామె కనక మానుతుందా
  •     కడుపులో లేనిది కౌగలించుకుంటే వస్తుందా?
  •     కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది
  •     కణత తలగడ కాదు. కల నిజం కాదు
  •    కన్ను పోయేంత కాటుక పెట్టదన్నట్లు...
  •     కన్నెర్రపడ్డా మిన్నెర్రపడ్డా కురవక తప్పదు
  •     కరవమంటే కప్పకి కోపం, విడవమంటే పాముకి కోపం
  •     కర్రలేని వాడిని గొర్రె కూడా కరుస్తుంది
  •     కలసి ఉంటే కలదు సుఖం
  •     కలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడు
  •     కల్లు త్రాగిన కోతిలా
  •     కళ్ళు కావాలంటాయి కడుపు వద్దంటుంది
  •     కాకి పిల్ల కాకికి ముద్దు
  •     కాగల కార్యం గంధర్వులే తీర్చారు
  •     కాపురం చేసే కళ కాళ్ళ పారాణి దగ్గరే తెలుస్తుంది
  •     కార్చిచ్చుకు గాడ్పు తోడైనట్లు
  •     కాలు కాలిన పిల్లిలా
  •     కాలం కలిసి రాకపోతే కర్రే పామవుతుంది
  •     కాలం కలిసి వస్తే ఏట్లో వేసినా ఎదురు వస్తుంది
  •     కాళ్లకు రాచుకుంటే కళ్లకు చలువ
  •     కాసుకు గతిలేదుకానీ... నూటికి ఫరవాలేదన్నట్లు
  •     కాసే చెట్టుకే రాళ్ల దెబ్బలు
  •     'కురూపీ, కురూపీ ఎందుకు పుట్టేవే?' అంటే 'స్వరూపాలెంచటానికి అందిట.
  •     కుంచెడు గింజల కూలికి పోతే.. తూమెడు గింజలు దూడమేసినట్లు
  •     కుండలో కూడు కుండలోనుండవలె, పిల్లలు చూడ గుండులవలెనుండవలె
  •     కుక్క కాటుకి చెప్పు దెబ్బ
  •     కుక్క కి చెప్పు తీపి తెలుసు కానీ ...చెరకు తీపి తెలుస్తుందా
  •     కుక్క తోక పట్టి గోదారి దాటాలనుకొన్నట్లు
  •     కుక్కతోక వంకరన్నట్లు...!
  •     కుప్ప తగులపెట్టి.. పేలాలు ఏరుకుతిన్నట్లు...
  •     కూటికి లేకున్నా కాటుక మాననట్లు
  •     కూడూ గుడ్డా అడక్కపోతే బిడ్డను సాకినట్లు సాకుతా అన్నాడట
  •     కూనను పెంచితే గుండై కరవ వచ్చినట్లు
  •     కూర్చుని తింటే, కొండలైనా తరిగిపోతాయి
  •     కూసే గాడిద వచ్చి మేసే గాడిదని చెడగొట్టినట్లు
  •     కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడినట్టు
  •     కొండను త్రవ్వి ఎలుకను పట్టినట్లు
  •     కొండముచ్చు పెండ్లికి కోతి పేరంటాలు
  •     కొడితె కొట్టాడులే కానీ కొత్తకోక తెచ్చాడులే అందిట
  •     కొత్త బిచ్చగాడు పొద్దు ఎరగడు
  •     కొత్త పెళ్ళి కొడుకు పొద్దు ఎరగడు
  •     కొత్తల్లుడిని మేపినట్లు మేపుతున్నారు
  •     కొన్నది వంకాయ కొసరింది గుమ్మడి కాయ అన్నట్లు..
  •     కోరి కొరివితో తల గోక్కున్నట్టు
  •     కోటి విద్యలు కూటి కొరకే
  •     కోడలికి బుధ్ధి చెప్పి అత్త తెడ్డి నాకింది
  •     కోడిగుడ్డు మీద ఈకలు పీకే రకం
  •     కోల ఆడితేనే కోతి ఆడుతుందన్నట్లు
  •     కోస్తే తెగదు కొడితే పగలదు
  •     క్రింద పడ్డా నాదే పైచేయి అన్నాడంట
  •     కల్ల పసిడికి కాంతి మెండు

0 comments:

Post a Comment