విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేలా హోంవర్క్‌ను, యూనిట్ టెస్ట్‌లను కుదించుకోవాలని నిర్ణయించిన సీబీఎస్ఈ బోర్డు మరో అడుగు ముందుకేసింది. ఇందుకోసం ప్రవేశపెట్టిన కంటిన్యువస్ కాంప్రిహెన్సివ్ ఇవాల్యుయేషన్(సీఎస్ఈ) విధానాన్ని పటిష్టంగా అమలు చేయాలని సంకల్పించింది. విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించే విషయంలో ప్రిన్సిపాల్స్, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఇలా విభిన్న వర్గాల నుంచి వచ్చిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని శిక్షకులను, శిక్షణ పొందిన ఉపాధ్యాయులను తయారు చేయాలని నిర్ణయించింది. తమ ప్రాజెక్టు వర్క్‌ల్లో మరింత స్వతంత్రంగా వ్యవహరించేలా, ఇచ్చిన పనుల్లో మరింతగా లీనమయ్యేలా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు ఈ శిక్షణ పొందిన ఉపాధ్యాయులు కృషి చేస్తారు. అలాగే, తల్లిదండ్రులతో నిరంతరం సంబంధాలు నెరపుతూ పిల్లలపై వారిలో ఉన్న ఆందోళనలను తగ్గించే ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది.
0 comments:
Post a Comment