భూమిని పోలిన గ్రహం
భూమి లాంటి గ్రహం మరొకటి ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ గ్రహం భూమికి 20 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఒక తార చుట్టూ పరిభ్రమిస్తున్నట్లు కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనికి గ్లీస్ 581జీ అని పేరు పెట్టారు. ఈ గ్రహం భూమి కంటే 3 రెట్లు పెద్దగా ఉంది. ఈ గ్రహంపై రాత్రి, పగలు ఉండవు. ఈ గ్రహం పై భూమి తరహాలో వాతావరణం, గురుత్వాకర్షణ శక్తి ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. జీవం మనగడకు అనువైన పరిస్థితులూ ఉన్నాయని నీరూ ఉండొచ్చని చెప్పారు. హవాయ్‌లోని డబ్ల్యూఎం కెక్ అబ్జర్వేటరీలో 11 ఏళ్ల పాటు పరిశీలనలు జరిపి ఈ గ్రహం తీరుతెన్నులను గమనించారు.
0 comments:
Post a Comment