చౌమొహల్లా ప్యాలెస్‌కు యునెస్కో హెరిటేజ్ మెరిట్ అవార్డు లభించింది. హైదరాబాద్ రాజధానిలోని చారిత్రక చార్మినార్ సమీపంలోని
'చౌమొహల్లా ప్యాలెస్' మరోమారు అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించింది. ఈ రాజప్రాసాదానికి 'యునెస్కో ఆసియా పసిఫిక్ హెరిటేజ్
మెరిట్ అవార్డు' లభించింది. ఆసఫ్‌జాహీ పాలకుల అధికార భవనంగా చరిత్రకెక్కిన ఈ ప్యాలెస్‌ను దేశ విదేశాల ప్రముఖులు సందర్శించి ముగ్ధులయ్యారు. మూడు నెలల క్రితం ప్యాలెస్ అధికారులు ఈ అద్భుత కట్టడ విశిష్టత, పరిరక్షణ ఫొటోలను యునెస్కో హెరిటేజ్ అవార్డు నిమిత్తం కమిటీకి పంపారు. మరో 13 దేశాలు కూడా పోటీపడ్డాయి. కాగా చౌమొహల్లా ప్యాలెస్‌కు అవార్డు వరించింది. బ్యాంకాక్‌లోని పది మంది సభ్యుల కమిటీ ఈ అవార్డును ప్రకటించింది.
0 comments:
Post a Comment