Flash News
Powered by Blogger.

Popular Posts

Blog Archive

Popular Posts

Bala Chelimi

Editor:
Manikonda Veda Kumar

Executive Editor:

Gali Udaya Kumar
---- ----
Bala Chelimi
Chandram, 490, Street No.11,
Himayat Nagar, Hyderabad 500 029
www.balachelimi.com

Mail Instagram Pinterest RSS

ఇంట గెలిచి రచ్చ గెలవమన్నట్లు

  • సామెతలు...
    తెలుగు సాహిత్యంలో సామెతల కేమీ కొదవ లేదు. నగర జీవి మరిచిపోయినా ఈ సామెతలు పల్లె జనం నోళ్లలో నేటికీ నానుతూ ఉన్నాయి. జంతువులు, చెట్లు, వ్యవసాయం..... ఇలా ఎన్నో విషయాల గురించి విలువైన సమాచారాన్ని సామెతల్లో నిక్షిప్తం చేశారు మన పూర్వీకులు. అటువంటి సామెతల నుంచి కొన్నిటిని ఇక్కడ ఇస్తున్నాం.
  •     ఇంట గెలిచి రచ్చ గెలవమన్నట్లు
  •     ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడు
  •     ఇంటికన్నా గుడి పదిలం
  •     ఇంటికి ఇత్తడి పురుగుకు పుత్తడి
  •     ఇంట్లో ఈగల మోత, వీధిలో పల్లకీల మోత
  •     ఇంట్లో పిల్లి వీధిలో పులి
  •     ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య
  •     ఇంత బతుకు బతికి ఇంటెనకాల చచ్చినట్టు
  •     ఇద్దరు ముద్దు ఆపై వద్దు
  •     ఇద్దరే సత్పురుషులు, ఒకడు పుట్టనివాడు, ఇంకొకడు గిట్టినవాడు
  •     ఇరుపోటీలతోటి ఇల్లు చెడె, పాత నొప్పులతోటి ఒళ్ళు చెడె
  •     ఇల్లలకగానే పండగకాదు
  •     ఇల్లలుకుతూ పేరు మర్చిపోయినట్లు
  •     ఇల్లు ఇచ్చినవాడికి, మజ్జిగ పోసినవాడికి మంచిలేదు
  •     ఇల్లు ఇరుకుగా ఉండాలి, పెళ్ళాం ఛ0ఢాలంగా ఉండాలి
  •     ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే,వల్ల కాలేదని ఒకడు ఏడ్చాడంట
  •     ఇల్లు కాలి ఒకరు ఏడుస్తుంటే ఏదో కావాలని ఎవడో ఏడ్చాడట
  •     ఇల్లుకాలి ఒకడేడుస్తుంటే, చుట్టకి నిప్పు అడిగాడంటొకడు
  •     ఇల్లు ఇరకాటం ఆలి మర్కటం
  •     ఇల్లు పీకి పందిరి వేసినట్లు
  •     ఇసుక తక్కెడ పేడ తక్కెడ
  •     ఇల్లలకగానే పండగ కాదు
  •     ఇంటి ముందు ములగ చెట్టు వెనుక వేప చెట్టు ఉండరాదు

0 comments:

Post a Comment