
మీ ఇంటి కరెంట్ బిల్లు ఎంత వస్తుంది నెలకు? సాధారణంగా మధ్య తరగతి ఇంటి కరెంట్ బిల్లు నెలకు మూడు నుంచి నాలుగు వందలు ఉంటుంది. మరి రాష్ట్రపతి భవన్, ప్రధాని నివాసం, కార్యాలయాల్లో ఏటా విద్యుత్ వినియోగానికి ఎంత వెచ్చిస్తున్నారో తెలుసా? అక్షరాలా రూ. 16 కోట్లకు పైనే. సమాచార హక్కు చట్టం దరఖాస్తు ద్వారా వెల్లడైన సమాచారమిది. ప్రధాని, రాష్ట్రపతి నివాసాలు, కార్యాలయాల్లో విద్యుత్ కోసం ఎంత ఖర్చు చేస్తున్నారనే సమాచారం కావాలంటూ ముంబైకి చెందిన చేతన్ కొఠారి అనే ఆర్టీఐ ఉద్యమ కార్యకర్త అడిగారు. గత నాలుగేళ్లుగా ఇందుకు సంబంధించిన లెక్కలను తెలపాలని కోరారు.
2009కి ప్రధాని నివాసం, పీఎంవో, రాష్ట్రపతి భవన్‌లో విద్యుత్ వినియోగానికి ఖర్చయిన మొత్తం రూ. 16.33 కోట్లుగా వెల్లడయ్యింది. అయితే, 2008 కన్నా ఇది 2 కోట్లు ఎక్కువని తెలిసింది. ఒక్క రాష్ట్రపతి భవన్‌లోనే 2009లో కరెంట్ కోసం 6.67 కోట్లు, పార్లమెంటు భవనం ఆవరణలో 8.9 కోట్లు వెచ్చించారు. 2008లో సుప్రీంకోర్టులో 2.47 కోట్లు, 2009లో 2.18 కోట్లు విద్యుత్ కోసం చెల్లించారు.
0 comments:
Post a Comment