ఆర్కిటిక్‌లో మంచు మాయం
వాతావరణ మార్పుల వల్ల 2050 నాటికి ఆర్కిటిక్ సముద్రంలో మంచు ఇక కనిపించదని రష్యా నిపుణులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. ''మరో 30-40 ఏళ్లలో ఉత్తర ధ్రువం సహా ఆర్కిటిక్ సముద్రవ్యాప్తంగా వేసవికాలంలో మంచు జాడలు కనిపించకపోవచ్చు'' అని రష్యా వాతావరణ కేంద్రం డైరెక్టర్ అలెగ్జాండర్ ఫ్లోరోవ్ తెలిపారు. వాతావరణ మార్పులపై ప్రభుత్వ నివేదికను ఆయన ఉటంకిస్తూ 2007 సమాచారంతో పోలిస్తే 2010లో మంచు పరిమాణం తగ్గిందని అన్నారు. ''మంచు సగటు స్థాయి తగ్గుతోంది. గతంలో 11 మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఆవరించి ఉన్న మంచు ప్రస్తుతం 10.8 మిలియన్ చదరపు కిలోమీటర్లకు తగ్గింది. ఉపగ్రహ చిత్రాల ద్వారా ఈ విషయం తేలింది'' అని తెలిపారు.
0 comments:
Post a Comment