63 మీటర్ల పొడవైన రెక్కలతో విచిత్రంగా కనిపిస్తున్న ఈ విమానం పేరు హెచ్‌బీ-సియా. పూర్తిగా సౌరవిద్యుత్‌తో నడుస్తుంది. రెక్కలపై అమర్చిన 12000 సోలార్ సెల్స్.. సౌరశక్తిని విద్యుచ్ఛక్తిగా మార్చి బ్యాటరీల్లో నిక్షిప్తం చేస్తాయి.
ప్రయోగాత్మకంగా.. రాత్రివేళల్లో కూడా బ్యాటరీల్లో నిల్వ వున్న విద్యుత్‌తో ఈ విమానాన్ని 25గంటలపాటు నిరంతరాయంగా నడిపేందుకు పిచర్డ్ బృందం సిద్ధమైంది. బుధవారం ఉదయం 4.51 నిమిషాలకు పేయెర్న్ ఎయిర్‌బేస్ నుంచి ఈ విమానం ప్రయాణం ప్రారంభించింది. నాలుగు మోటార్లు కలిగిన ఈ విమానం పొడవు 21.85 మీటర్లు, ఎత్తు 6.40 మీటర్లు, బరువు 1,600 కిలోలు. గరిష్ఠంగా 9100 మీటర్ల ఎత్తుకు చేరుకోగల ఈ విమానం గరిష్ఠ వేగం గంటకు 40.2కిలోమీటర్లు.
0 comments:
Post a Comment