చాచా నెహ్రు పుట్టినరోజు - పిల్లల పండుగ
పువ్వులంటే ఆయనకు ఇష్టం!
పిల్లలంటే ఎంతో ఇష్టం!!
తీరికలేని సమయాల్లో కూడా, ఏకాస్త తీరిక దొరికినా పిల్లలతో ఆనందంగా గంతులేస్తూ ఆడుకునేవారు.
ఆయనే తొలి భారత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ.
''అపారమైన సంఖ్యలో గల పిల్లలు చూపులకు రకరకాలుగా కనిపిస్తారు. తలో భాష మాట్లాడతారు. రంగురంగుల బట్టలు వేసు కుంటారు. అయినా ఒకే మాదిరిగా ఉంటారు. ఒకేచోట చేరి ఆడుకుంటారు, పాడుకుంటారు, గంతులేస్తారు, పోట్లాడుకుంటారు. అయితే మళ్ళీ వెంటనే కలిసిపోతారు. రంగూ, కులం, భాషా భేదాలు వారికి తెలియవు. వీటి విషయం వారు ఆలోచించరు. నిజానికి పిల్లలు తమ తల్లిదండ్రులకంటే తెలివైనవారు.'' అని చాచా నెహ్రూ అంటారు. వారే మరొక సందర్భంలో ''పిల్లలతో ఉండటానికి ఇంకా చెప్పాలంటే వారితో ఆడుకోవటానికి ఎంతో ఇష్టపడతాను. కొద్ది క్షణాల పాటు నేను ముసలివాణ్ణనే విషయం మరిచిపోతాను'' అని అంటారు.
పండిట్ జవహర్‌లాల్‌నెహ్రూ కాశ్మీరు పండిత కుటుంబంలో జన్మించారు కాబట్టి వారిని పండిత్‌జీ, అని పిలుస్తారు. నెహ్రూను పిల్లలు ముద్దుగా చాచానెహ్రూ, జవహర్, జవహర్ భాయి అని పిలుచుకుంటారు.
-డాక్టర్ వెలగా వెంకటప్పయ్య
0 comments:
Post a Comment