రవి: సార్! మీరు దేన్నీగురించి ప్రయోగం చేస్తున్నారు.
సైంటిస్ట్: ఏ వస్తువుపైన పోసినా వెంటనే ఆ వస్తువు కరిగిపోయే రసాయనాన్ని గురించి బాబు!
రవి: మరయితే ఆ రసాయనాన్ని దేనిలో నిలువ చేస్తారు.......?
జాబిల్లి రావే...
ఏడుస్తున్న పాపకు తల్లి జోలపాట పాడుతుంది.
''చందమామ రావే
జాబిల్లి రావే....''
పాఠాలు చదువుతూ పెద్దపాప ఆ పాటవిని 'చంద్రుడెలా వస్తాడమ్మా! ఆయనెప్పుడూ భూమిచుట్టూ తిరుగుతాడు కదా!
--- కలలెలా వస్తాయి
పాప: అమ్మా! నువ్వు రోజూ తలుపుకు గడియ వేస్తావా?
అమ్మ: అవును ఏం.....?
పాప: అలావేస్తే నాకు కలలెలా వస్తాయి.
చరిత్ర
వేణు: చరిత్రలో నాకు అరవై మార్కు లొచ్చాయి తాతయ్యతాత: హు! మారోజుల్లో అయితే తొంభై మార్కులొచ్చేవి.
వేణు: అప్పట్లో చరిత్ర తక్కువగా ఉండేది మరి.
మీ అన్నయ్యేడి?
స్కూలుకు ఆలస్యంగా వచ్చిన వేణుతో-
టీచర్: వేణూ! ఆలస్యమెందుకయింది;
వేణు: వర్షం వచ్చింది కదూ! రోడ్డుపైన ఉండే కుండీలలో పడతానేమోనని మా అన్నయ్య తీసుకొచ్చాడు.
టీచర్: ఇంతకీ మీ అన్నయ్యేడి?
వేణు: కుండీలో పడిపోయాడు.
మనమంతా ఏమౌతామో?
విచారంగా స్కూలు మెట్లపై కూర్చున్న సురేష్‌ను చూసి
అశోక్: ఏమిట్రా అలా బాధగా కూర్చున్నావ్
సురేష్: ఇంకో 6 మిలియన్ సంవత్పరాలకు భూమి నశించి పోతుందని టీచర్ చెప్పింది కదా! మనమంతా ఏమౌతామో అని!
చిన్న మీటింగ్
కొడుకు: నాన్నా! మనమిప్పుడు చిన్న మీటింగ్‌కు వెళ్తున్నాం....?తండ్రి: చిన్న మీటింగేమిట్రా....?
కొడుకు:మా టీచర్-నీవు-నేను, మన ముగ్గురి మీటింగే
తండ్రి: అదేం మీటింగ్‌రా?
కొడుకు: మరేమో- నిన్ననే మాకు రిపోర్టులు ఇచ్చారు కదా!
0 comments:
Post a Comment