పరీక్ష హాలు నుండి బయటికి వచ్చిన హెడ్‌మాస్టర్, అనిల్, సునీల్ పోట్లాడు కోవడం చూశారు.
హెడ్‌మాస్టర్: మీరిద్దరు ఎందుకు పోట్లాడుకుంటున్నారు.
అనిల్: సార్ ఇతను నా పేపరు చూసి కాపీ కొట్టాడు.
హెడ్‌మాస్టర్: ఏది కాపీ గొట్టాడు
అనిల్: నేను తెల్లపేపరిస్తే వీడు కూడా అలాగే ఇచ్చాడు.
----
గోపి: నాన్నా గోల్కొండ ఎక్కడుంది?
తండ్రి: హైదరాబాద్‌లో.
గోపి: అలాగా! అది బొంబాయిలో ఉంటే ఎంత బావున్ను.
నాన్న: ఎందుకురా?
గోపి: మరి నేను బొంబాయిలో ఉందని రాశాగా!
---
మాష్టారు: తాజ్‌మహల్ ఎక్కడుందిరా?
సంతోష్: తెలియదండి.
మాష్టారు: అయితే బెంచీ ఎక్కు.
సంతోష్: బెంచీ ఎక్కితే కనిపిస్తుందాండి.
---
సతీష్: (ఏడుస్తూ...) నాన్నా నా బుడగను రాము పైకి వదిలేశాడు.
నాన్న: ఏరా రాము ఎందుకు వదిలేశావ్
రాము: నిన్న మా టీచర్ చెప్పింది. భూమికి ఆకర్షణ శక్తి ఉందని. నాకేం తెలుసు భూమి బుడగలను ఆకర్షించదని.
0 comments:
Post a Comment