ఒక అడవిలో ఒక సింహం బాగా తిని చెట్టుకింద పడుకొంది. అటుగా వెళ్తున్న ఒక దోమ పడుకున్న సింహాన్ని చూసింది.
అడవిలో జంతువులన్నీ సింహాన్ని రాజుగా గౌరవిస్తాయి కదా! ఈ సింహం గొప్ప ఏమిటి? ఇది నా కంటే గొప్పదా? దీని గొప్ప తనమేమిటో చూస్తా?'' అనుకొంటూ సింహం చుట్టూ 'జుయ్' మని శబ్దం చేస్తూ తిరిగింది. దోమ చేసిన శబ్దానికి సింహానికి మెళుకువ వచ్చింది. సింహం నిద్ర చెడిపోయినందుకు దోమ సంతోషిస్తూ సింహం ముందు వాలి-
''మృగరాజా!మృగరాజా!! అడవిలో నీవే బలమైనదానివని అందరూ అంటుంటారు కదా! నేను నీకంటె గొప్పదానిని తెలుసా?'' అంది దోమ సగర్వంగా-
దోమ మాటలకు సింహానికి చాలా కోపం వచ్చింది. వెంటనే అది దోమను చంపబోయింది. కానీ దోమ ఠక్కున తప్పించుకుని పైకి ఎగిరి-
''చూశావా! నీవు నన్ను పట్టుకోలేక పోయావు'' అంది నవ్వుతూ - సింహానికి కోపం మరీ ఎక్కువైంది. దోమ, సింహం చుట్టూ తిరుగుతూ సింహం ముక్కుపై వాలింది. సింహం తన పంజాతో ఒక్కటి కొట్టింది. దోమ 'జయ్' మంటూ గాలిలోకి ఎగిరింది. పంజా తన ముక్కుపైనే పడి రక్తం చిమ్మింది. ఈ విధంగా దోమ, సింహం కన్నుపై, చెవులపై వాలుతూ సింహాన్ని బాధించసాగింది. అలా గర్వంతో సింహాన్ని బాధిస్తున్న దోమ హఠాత్తుగా పక్కనే చెట్టుకి ఉన్న సాలె గూడులో చిక్కుకు పోయింది. సాలె పురుగు తన గూడులో చిక్కుకుపోయిన దోమను లటుక్కున మింగింది.
'అన్నింటికంటే నేనే గొప్పదానిననుకొని గర్వ పడ్డాను. నాకంటే గొప్పవి కూడా ఉన్నాయని ఇప్పుడు తెలిసింది. నాగర్వమే నా చావుకు కారణమైంది'' అనుకుంటూ దోమ ప్రాణం విడిచింది.

0 comments:
Post a Comment